Nayanthara: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె భాషతో సంబంధం లేకుండా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ ‘మాయానిజాల్’. ఇందులో కుంచ బోబన్ హీరోగా నటించగా.. ఎన్ భట్టాత్రి దర్శకత్వం వహించాడు. అయితే 2021లో థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఈ క్రమంతో.. తాజాగా, మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
ఆహా తమిళ్ ఓటీటీలో ఆగస్టు 30 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆహా సంస్థ అఫీషియల్‌గా వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నయన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సినిమా కథ విషయానికొస్తే.. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు సమాచారం. ఓ చిన్నపిల్లాడు ఈ మర్డర్ కేసును ఎలా కనిపెట్టాడనేదే అసలు కథ. ఇందులో నయనతార ఆ పిల్లాడికి తల్లి పాత్రలో నటించింది. కుంచ బోబన్ న్యాయమూర్తి పాత్రలో మెప్పించారు.