వరంగల్‌లో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్.. అధికారులకు కీలక ఆదేశాలు
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని సుందరీకరించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను గురువారం ఆమె సందర్శించారు. భవన సుందరీకరణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ.. భవనానికి నలు వైపులా ప్రహరీలకు వివిధ రకాల మొక్కలను నాటాలని, ఖాళీ ప్రదేశాలలో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటేలా చూడాలని […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని సుందరీకరించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను గురువారం ఆమె సందర్శించారు. భవన సుందరీకరణ పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ.. భవనానికి నలు వైపులా ప్రహరీలకు వివిధ రకాల మొక్కలను నాటాలని, ఖాళీ ప్రదేశాలలో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ వాసు చంద్ర, డీఎఫ్‌ఓ అర్చన, ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ లింగారెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ మనోహర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సునీత, జిల్లా సెరికల్చర్ అధికారి శ్రీనివాస్, హనుమకొండ తహసీల్దార్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.