ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు..

దిశ, ములుగు : ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారి పాణిని, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ మురాలశంకర్ రావు, ములుగు జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి తౌటం రమేష్ కలిసి ములుగు జిల్లా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో పదవ తరగతి, ఇంటర్ మీడియట్‌లలో ప్రవేశాలకు సంబంధించి నవంబర్ 15వ తేదీ వరకు గడువు తేదీని పొడిగించినట్టు పేర్కొన్నారు. […]

Update: 2021-10-22 10:13 GMT

దిశ, ములుగు : ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారి పాణిని, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ మురాలశంకర్ రావు, ములుగు జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి తౌటం రమేష్ కలిసి ములుగు జిల్లా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో పదవ తరగతి, ఇంటర్ మీడియట్‌లలో ప్రవేశాలకు సంబంధించి నవంబర్ 15వ తేదీ వరకు గడువు తేదీని పొడిగించినట్టు పేర్కొన్నారు.

2021-22 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్‌లో ఆలస్యంగా ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు అపరాధ రుసుముతో కలుపుకుని గడువు తేదీని పొడిగించినట్టు తెలిపారు.పదవ తరగతిలో ప్రవేశాలకు ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ అమ్మాయిలకు రూ.800, ఓసీ అబ్బాయిలు రూ.1200 చెల్లించాలని తెలిపారు. ఇంటర్‌లో ప్రవేశాలకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అమ్మాయిలకు రూ.1200.. ఓసీ వర్గానికి చెందిన అబ్బాయిలు రూ.1500 చెల్లించి అడ్మిషన్లు పొందాలన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పూర్తి వివరాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్‌రావు నెంబర్ 80084 03631ను సంప్రదించాలని సూచించారు.

Tags:    

Similar News