షర్మిలకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల రెడీ అయ్యారు. మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల కొద్దిరోజుల క్రితం ప్రకటించగా.. తాజాగా పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా షర్మిల మాత్రం తాను మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం దుమారం రేగుతోంది. రేపు ఉదయం 10 గంటల […]

Update: 2021-04-14 02:41 GMT
షర్మిలకు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల రెడీ అయ్యారు. మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల కొద్దిరోజుల క్రితం ప్రకటించగా.. తాజాగా పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా షర్మిల మాత్రం తాను మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం దుమారం రేగుతోంది.

రేపు ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే నిరాహార దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిలకు హైదరాబాద్ పోలీసులు అనుమతిచ్చారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేంతవరకు దీక్షలు చేస్తూనే ఉంటానని షర్మిల ప్రకటించారు.

Tags:    

Similar News