మాస్కులు పెట్టుకోవడంలో ఇంత నిర్లక్ష్యమా..!
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ఫేస్ మాస్కులే రక్షణ అని వైద్యులతో పాటు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) మొత్తుకుంటున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. కరోనా నియంత్రించడంలో మాస్కులు సుమారు 80 శాతం రక్షన కల్పిస్తాయని చెబుతున్నా.. సింగిల్ కాదు డబుల్ మాస్కులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నా.. భారత్‌లో మాత్రం దానిని పెట్టుకోవడంపై జనాలింకా నిర్లక్ష్యపు మత్తు వీడటం లేదు. భారత్‌లో 44 శాతం మంది మాత్రమే ఫేస్ మాస్కును క్రమమైన పద్ధతిలో ధరిస్తున్నారట. ఏక్‌దేశ్ […]
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ఫేస్ మాస్కులే రక్షణ అని వైద్యులతో పాటు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) మొత్తుకుంటున్నా కొంతమందికి చెవికెక్కడం లేదు. కరోనా నియంత్రించడంలో మాస్కులు సుమారు 80 శాతం రక్షన కల్పిస్తాయని చెబుతున్నా.. సింగిల్ కాదు డబుల్ మాస్కులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నా.. భారత్‌లో మాత్రం దానిని పెట్టుకోవడంపై జనాలింకా నిర్లక్ష్యపు మత్తు వీడటం లేదు. భారత్‌లో 44 శాతం మంది మాత్రమే ఫేస్ మాస్కును క్రమమైన పద్ధతిలో ధరిస్తున్నారట. ఏక్‌దేశ్ అనే సంస్థ ‘అప్నా మాస్క్’ పేరిట ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది మాత్రమే తాము విధిగా మాస్కు పెట్టుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన కొవిడ్-19 మార్గదర్శకాలు తమకు తెలుసునని 90 శాతం మంది తెలపగా.. వారిలో సగం కూడా మాస్కులు పెట్టుకోకపోవడం గమనార్హం.