జీహెచ్ఎంసీలో 3 కొత్త కొవిడ్ కేసులు..
– ఊపిరి పీల్చుకున్న వైద్య, ఆరోగ్య శాఖ దిశ, న్యూస్ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,085కు చేరింది. 3 రోజుల తర్వాత కొత్త కేసులు సింగిల్ డిజిట్‌లోకి వచ్చాయి. ఈ నెల 1వ తేదీన 6 కేసులు నమోదుకాగా ఆ తర్వాత రెండ్రోజుల పాటు 17, 21 కేసుల చొప్పున నమోదయ్యాయి. సోమవారం కేవలం 3 […]
– ఊపిరి పీల్చుకున్న వైద్య, ఆరోగ్య శాఖ
దిశ, న్యూస్ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,085కు చేరింది. 3 రోజుల తర్వాత కొత్త కేసులు సింగిల్ డిజిట్‌లోకి వచ్చాయి. ఈ నెల 1వ తేదీన 6 కేసులు నమోదుకాగా ఆ తర్వాత రెండ్రోజుల పాటు 17, 21 కేసుల చొప్పున నమోదయ్యాయి. సోమవారం కేవలం 3 కేసులే నమోదుకావడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగించినట్లయింది. ఈ నెల 7వ తేదీతో ముగియనున్న రెండో విడత లాక్‌డౌన్ తర్వాత ఆంక్షల సడలింపుపై రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కావడానికి సన్నద్ధమవుతున్న సమయంలో కేవలం 3 కేసులే కొత్తగా రావడం గమనార్హం. మరోవైపు చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే 40 మంది డిశ్చార్జి కావడంతో చికిత్స నుంచి కోలుకుని ఇళ్లకు చేరినవారి సంఖ్య 585 అయింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు 471 మంది ఉన్నారు.
Tags: Telangana, KCr, corona, Lockdown, Health