TSRTC కీలక నిర్ణయం.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎండీ సజ్జనార్

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌కొనే సమయంలో ఆన్‌లైన్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు నెటిజన్లు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలు మొగ్గుచూపుతుండటంతో ఆర్టీసీలోనూ ఇదే పద్దతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద MGBS, రెతిఫైల్ బస్ స్టేషన్(బస్ […]

Update: 2021-10-19 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్‌కొనే సమయంలో ఆన్‌లైన్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు నెటిజన్లు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలు మొగ్గుచూపుతుండటంతో ఆర్టీసీలోనూ ఇదే పద్దతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద MGBS, రెతిఫైల్ బస్ స్టేషన్(బస్ పాస్ కౌంటర్) సికింద్రాబాద్‌లో మంగళవారం నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అమలులోకి తీసుకొచ్చామని సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దీని వినియోగాన్ని కొన్ని రోజులు గమనించి, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అందువల్ల ప్రయాణికులు ఆన్‌లైన్ పేమెంట్స్ సదుపాయాన్ని వినియోగించి సక్సెస్ చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News