2020లో 80 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో పాటు దేశీయంగా డిజిటలైజేషన్ కారణంగా 2020లో ఆన్‌లైన్ లావాదేవీలు 80 శాతం పెరిగాయని ప్రముఖ ఫైన్‌టెక్ సంస్థ రేజర్‌పే నివేదిక తెలిపింది. ముఖ్యంగా టైర్2, టైర్ 3 నగరాల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయని పేర్కొంది. గతేడాదిలో యూపీఐ లావాదేవీలు కార్డులు, నెట్‌బ్యాంకింగ్, వ్యాలెట్ విభాగాల కంటే 120 శాతం వృద్ధి నమోదైందని రేజర్‌పే వెల్లడించింది. టైర్2, టైర్3 నగరాల్లో యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరగడమే దీనికి కారణమని తెలిపింది. గతేడాది […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారితో పాటు దేశీయంగా డిజిటలైజేషన్ కారణంగా 2020లో ఆన్‌లైన్ లావాదేవీలు 80 శాతం పెరిగాయని ప్రముఖ ఫైన్‌టెక్ సంస్థ రేజర్‌పే నివేదిక తెలిపింది. ముఖ్యంగా టైర్2, టైర్ 3 నగరాల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయని పేర్కొంది. గతేడాదిలో యూపీఐ లావాదేవీలు కార్డులు, నెట్‌బ్యాంకింగ్, వ్యాలెట్ విభాగాల కంటే 120 శాతం వృద్ధి నమోదైందని రేజర్‌పే వెల్లడించింది. టైర్2, టైర్3 నగరాల్లో యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరగడమే దీనికి కారణమని తెలిపింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో మొదట డిజిటల్ చెల్లింపు 30 శాతం క్షీణించాయని, అయితే, ఆ తర్వాత లాక్‌డౌన్ ప్రారంభమైన మొదటి 70 రోజుల్లో 23 శాతం పుంజుకున్నాయి. 2019తో పోలిస్తే 2020లో ఆన్‌లిన లావాదేవీలు 80 శాతం పెరిగాయి. వినియోగదారులు, వ్యాపారులు డిజిటల్ చెల్లింపులనే ఆశ్రయించారు. అదికూడా 2020 చివరి ఆరు నెలల్లో పలు రంగాల్లో వ్యాపారాలు నెమ్మదిగా కోలుకునే సంకేతాలను చూపించిన తర్వాతే ఎక్కువగా జరిగాయని రేజర్‌పే నివేదిక పేర్కొంది. 2020 మొదటి ఆరు నెలలతో పోలిస్తే జులై నుంచి డిసెంబర్ మధ్య డిజిటల్ చెల్లింపు 73 శాతం వృద్ధిని సాధించాయి.