ఆన్‌లైన్ గేమింగ్ అందరికీ కాదు!
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి లక్షల్లో సంపాదిస్తుంటారని మనం ఇక్కడో అక్కడో చదువుతూనే ఉంటాం. అది నిజమే.. కానీ అందరూ అలా సంపాదించలేరు. ఊరికే గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారని కుళ్లుకోవడం, మనం ఆడలేమా? అని ప్రయత్నించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే క్రియేటివ్ రంగం అనేది ఒక ప్యాషన్. ఆసక్తి, ఉత్సాహం, కష్టపడేతత్వం ఉండాలి. ఒకరు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే అది అదృష్టం కాదు. అతను చిన్నప్పటి నుంచి గేమ్స్ మీద ఆసక్తి గలవాడై ఉండాలి. […]
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి లక్షల్లో సంపాదిస్తుంటారని మనం ఇక్కడో అక్కడో చదువుతూనే ఉంటాం. అది నిజమే.. కానీ అందరూ అలా సంపాదించలేరు. ఊరికే గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారని కుళ్లుకోవడం, మనం ఆడలేమా? అని ప్రయత్నించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే క్రియేటివ్ రంగం అనేది ఒక ప్యాషన్. ఆసక్తి, ఉత్సాహం, కష్టపడేతత్వం ఉండాలి. ఒకరు గేమ్స్ ఆడి సంపాదిస్తున్నారు అంటే అది అదృష్టం కాదు. అతను చిన్నప్పటి నుంచి గేమ్స్ మీద ఆసక్తి గలవాడై ఉండాలి.
ఊరికే గేమ్స్.. గేమ్స్.. అంటున్నాడని తల్లిదండ్రులతో తిట్లు పడినవాళ్లు అయ్యుండాలి. తన చుట్టుపక్కల గేమ్స్ గురించి సమాచారం ఇచ్చే సోర్స్‌లు లేకపోతే కష్టపడి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి నేర్చుకున్నవాడు అయ్యుండాలి. అన్ని సంవత్సరాలు ఇలా ఆసక్తిగా కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు గేమ్స్ ఆడి సంపాదించగలుగుతున్నాడు. అంతే తప్ప.. అది అందరూ చేయగలిగిన పని కాదు.
కాబట్టి వాడికి డబ్బులు వస్తున్నాయి కదా అని ఆన్‌లైన్ గేమింగ్‌లో పెట్టుబడి పెడితే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే అవుతుంది. అందుకని క్రియేటివ్ రంగంలో ఎప్పుడైనా ఒకరు సక్సెస్ అయ్యారు కదా అని వారిలా చేయాలనుకోవడం ఎన్నటికీ వర్కవుట్ కాదు. ఒకవేళ వర్కవుట్ అయినా అది ఎక్కువ కాలం ఉండదు. డబ్బుల కోసం కాకుండా ప్యాషన్ ఉన్నపుడు మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్ లాంటి రంగాల్లో అడుగుపెట్టాలి. ఇంతకీ ఈ ఆన్‌లైన్ గేమర్లు డబ్బులు ఎలా సంపాదిస్తారో తెలుసా?
సాధారణంగా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నవాళ్లకంటే చూసే వాళ్లకే ఎక్కువ మజా వస్తుంది. ఈ ఒక్క లాజిక్ ద్వారానే ఈ ఆన్‌లైన్ గేమింగ్ స్ట్రీమ్ ఇండస్ట్రీ ఎదుగుతోంది. ఫ్రీ ఫైర్, పబ్జీ, జీటీఏ లాంటి ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్‌లు కూడా ఒకరు ఆడుతుంటే చూడటం భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటుంది. అందుకే గేమ్ ఆడేవారు తమ గేమ్‌ను యూట్యూబ్, ట్విచ్ లాంటి సైట్లలో స్ట్రీమ్ చేస్తారు. ఇలా స్ట్రీమ్ చేస్తున్నపుడు వారు రెండు రకాలుగా ఆదాయాన్ని పొందుతారు. లైవ్‌లో ఆడుతుండగా చూసే వాళ్ల నుంచి డొనేషన్‌లు అడగడం ద్వారా గేమ్ స్ట్రీమర్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. పది రూపాయలు, ఇరవై రూపాయలు డొనేట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డొనేషన్‌లు చూడటానికి చిన్నమొత్తాలలాగానే అనిపిస్తాయి.
కానీ స్ట్రీమింగ్ చూసే వారు వేల సంఖ్యల్లో ఉంటారు, దీంతో ఒక్కొక్కరు పది రూపాయలు డొనేట్ చేసినా పెద్దమొత్తంలో డబ్బు వస్తుంది. అయితే ఆడే ఆట చూసేవాళ్లకు నచ్చాలి. అలా ఆడటం అందరి వల్లా కాదు. ప్యాషన్ ఉన్న గేమర్ మాత్రమే ఇతరులకు ఆసక్తి కలిగేలా ఆడగలుగుతాడు. అలాగే లైవ్ అయిపోయిన తర్వాత ఆ గేమింగ్ వీడియో రికార్డెడ్ వెర్షన్ యూట్యూబ్ లేదా ట్విచ్‌లో ఉండిపోతుంది. ఇక దీన్ని ఎవరైనా ప్లే చేస్తే యాడ్ రెవెన్యూ వస్తుంది. ఇలా రెండు రకాలుగా సంపాదిస్తారు కాబట్టే వారి సంపాదన మిలియన్లలో ఉంటుంది. కాబట్టి మరొక్కసారి చెప్పేది ఏంటంటే.. వారికి డబ్బులు ఊరికే రాట్లేదు. గేమింగ్ ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ ఉన్న వారు మాత్రమే నిలదొక్కుకోగలుగుతారు. ప్యాషన్ లేకుండా దాన్ని ఒక ఉపాధి మార్గంగా ట్రీట్ చేస్తే మాత్రం నష్టాలు తప్పవు.