కొనసా..గుతున్న పైపులైన్ పనులు

దిశ, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పైపులైన్ పనులు నత్తనడకన సాగుతుండడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పట్లేదు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌ బస్తీలో కొన్ని నెలలుగా మురుగు నీటి పైపులు ధ్వంసమై తాగునీటిలో మురుగునీరు కలిసి సరఫరా అయింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పోచమ్మ గుడి వద్ద ధ్వంసమైన పైప్‌లైన్‌ వద్ద మరమ్మతులు చేపట్టారు. కొత్తలైన్ కోసం రోడ్డును తవ్వి రోజుల తరబడి పనులను కొనసాగిస్తుండడంతో బురద […]

Update: 2021-10-10 06:54 GMT

దిశ, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పైపులైన్ పనులు నత్తనడకన సాగుతుండడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పట్లేదు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌ బస్తీలో కొన్ని నెలలుగా మురుగు నీటి పైపులు ధ్వంసమై తాగునీటిలో మురుగునీరు కలిసి సరఫరా అయింది. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. పోచమ్మ గుడి వద్ద ధ్వంసమైన పైప్‌లైన్‌ వద్ద మరమ్మతులు చేపట్టారు. కొత్తలైన్ కోసం రోడ్డును తవ్వి రోజుల తరబడి పనులను కొనసాగిస్తుండడంతో బురద పేరుకుపోయింది. రోడ్డుకు ఒక వైపు తవ్వడంతో రహదారి ఇరుకుగా మారింది. దీంతో బస్తీలోని రాకపోకలు కొనసాగించే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇందుకు తోడు వర్షాలు కురవడంతో బస్తీ ప్రధాన రహదారి అంతా చిత్తడిగా మారి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. వీలైనంత త్వరగా పైపులైన్ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News