కొనసాగుతున్న అల్పపీడనం.. మరో 3 రోజులు వర్షాలే..

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ, మద్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర తీరానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వివరించింది. దీంతో నేడు కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నాయని తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్‌ను […]

Update: 2021-09-12 08:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ, మద్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర తీరానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వివరించింది. దీంతో నేడు కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నాయని తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది.

ఆదిలాబాద్, కొమర భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదివారం అత్యధికంగా కొమరం భీం ఆసీఫాబాద్ జిల్లా దహేగాన్‌లో 52.2మిమీ, అత్యల్పంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 0.2మిమీ వర్షాపాతం నమోదైంది.

Tags:    

Similar News