ఫస్ట్‌లుక్‌లో ఆకట్టుకున్న ‘వన్‌ప్లస్ నార్డ్’
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. డియర్ పాస్ట్ పేరుతో వన్‌ప్లస్ ట్విటర్, యూట్యూబ్ చానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో టీజర్‌ను షేర్ చేసింది. ఈ బడ్జెట్ ఫోన్‌ను ‘నార్డ్’ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. వన్ ప్లస్ త్వరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ నార్డ్’ను తీసుకొస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. డియర్ పాస్ట్ పేరుతో వన్‌ప్లస్ ట్విటర్, యూట్యూబ్ చానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో టీజర్‌ను షేర్ చేసింది. ఈ బడ్జెట్ ఫోన్‌ను ‘నార్డ్’ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు.
వన్ ప్లస్ త్వరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘వన్‌ప్లస్ నార్డ్’ను తీసుకొస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ దీని గురించి కంపెనీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. తాజాగా ‘నార్డ్’ ఫోన్‌లోని ఫీచర్లపై ఓ హింట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన టీజర్ పేజ్‌ను కూడా అమెజాన్ వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేసింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తుండగా.. ఈ ఫీచర్‌తో లాంచ్ అయ్యే మొదటి వన్‌ప్లస్ ఇదే కావడం విశేషం. తాజాగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లో కూడా ఒక్క సెల్ఫీ కెమెరానే అందించారు.
వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్ :
డిస్‌ప్లే : 6.4 ఇంచులు
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 765జీ 5జీ
ర్యామ్ : 10 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128 జీబీ
బ్యాటరీ : 4000ఎంఏహెచ్
ధర : సుమారు రూ. 37,000/-