ఏడాది బాలుడిని మింగిన డెంగీ

దిశ, అశ్వారావుపేట : డెంగీతో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని అర్బన్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న పానుగంటి వెంకన్న దంపతుల కుమారుడు ఈశ్వర్ (1)కు గత రెండు రోజులుగా జ్వరం రావడంతో సత్తుపల్లి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ అని నిర్ధారించారు. సత్తుపల్లి ఆస్పత్రులల్లో బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో, […]

Update: 2021-09-28 09:06 GMT

దిశ, అశ్వారావుపేట : డెంగీతో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని అర్బన్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీలో నివాసం ఉంటున్న పానుగంటి వెంకన్న దంపతుల కుమారుడు ఈశ్వర్ (1)కు గత రెండు రోజులుగా జ్వరం రావడంతో సత్తుపల్లి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ అని నిర్ధారించారు.

సత్తుపల్లి ఆస్పత్రులల్లో బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో, అక్కడి నుండి పక్క రాష్ట్రమైన ఆంధ్రలోని బుట్టాయిగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. బాలుడి ఆరోగ్యం మెరుగవడంతో సోమవారం రాత్రి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో బాలుడు మరణించాడు. బాలుడు మరణంతో ఆ కాలనీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News