‘సూపర్ 30’ చాలా నేర్పింది : హృతిక్

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమా రిలీజ అయి ఏడాదైన సందర్భంగా మూవీ యూనిట్‌కు థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు హృతిక్. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన సినిమాను ఫాంటమ్ ఫిల్మ్స్, నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సంజీవ్ దత్తా రచయిత కాగా, అజయ్ – అతుల్ సంగీతం అందించిన ఈ చిత్రం తన మనసుకు చాలా దగ్గరైందని తెలిపాడు హృతిక్. ‘నిశ్శబ్ధంగా […]

Update: 2020-07-14 02:25 GMT

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ సినిమా రిలీజ అయి ఏడాదైన సందర్భంగా మూవీ యూనిట్‌కు థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు హృతిక్. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన సినిమాను ఫాంటమ్ ఫిల్మ్స్, నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సంజీవ్ దత్తా రచయిత కాగా, అజయ్ – అతుల్ సంగీతం అందించిన ఈ చిత్రం తన మనసుకు చాలా దగ్గరైందని తెలిపాడు హృతిక్.

‘నిశ్శబ్ధంగా అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం అంటే నిజంగా దేవుడి సారాన్ని తెలుసుకోవడమే. అభిరుచిని పరీక్షించడం అంటే నిజమైన ధైర్యాన్ని కనుగొనడమే. ఇతరులను క్షమించడం, వారి పట్ల దయగా ఉండటం అంటే ప్రేమను తెలుసుకోవడమే’ అని పోస్ట్ పెట్టిన హృతిక్.. పైన చెప్పిన గుణాలన్నీ ‘సూపర్ 30’లో తను చేసిన ఆనంద్ అనే క్యారెక్టర్‌లో ఉన్నాయని తెలిపాడు. అలాంటి గొప్ప రోల్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. సూపర్ 30 మూవీ యూనిట్ స్వర్గం యొక్క సంగ్రహనం కోసం నరకం వరకు వెళ్లొచ్చిందన్న హృతిక్.. యూనిట్ సభ్యులందరినీ ప్రేమిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News