ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. అనుమానాస్పద స్థితిలో మరో ఇద్దరు మృతి

దిశ, మునగాల : ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్ గూడెంలో గురువారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మునగాల మండలంలోని బరాకత్ గూడెం గ్రామానికి చెందిన కొర్ర రవి (35 ) ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తుండగా, రెండు నెలల కిందట నడిగూడెం మండల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. గురువారం తెల్లవారు జామున ఉదయం 3 గంటల ప్రాంతంలో […]

Update: 2021-05-27 10:46 GMT

దిశ, మునగాల : ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునగాల మండలం బరాఖత్ గూడెంలో గురువారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మునగాల మండలంలోని బరాకత్ గూడెం గ్రామానికి చెందిన కొర్ర రవి (35 ) ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తుండగా, రెండు నెలల కిందట నడిగూడెం మండల పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. గురువారం తెల్లవారు జామున ఉదయం 3 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలు నిద్రిస్తుండగా తన సొంత పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులే హోంగార్డు మృతికి కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మునగాల ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హోంగార్డు రవి మృతి పట్ల నడిగూడెం మండల ఎస్ఐ ఏడుకొండలు, జమీందార్ మల్లయ్య, సిబ్బంది తదితరులు సంతాపం ప్రకటించారు.

అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని..

మునుగోడు : ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊదరి నవీన్(20) తెల్లవారు జామున 6 గంటల 45 నిమిషాలకు తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడ గల గదిలోని ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నవీన్ ఇంటర్మీడియట్‌లోనే చదువుకు స్వస్తి చెప్పి వ్యవసాయ పనుల్లో తన తండ్రికి సాయం ఉంటున్నాడు. అయితే, నవీన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతుని తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ ఎన్.శ్రీనివాస్ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

కోదాడ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన అమర గాని రవితేజ (19) బేతవోలు గ్రామం నుండి చిలుకూరు వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపారు. మృతుని తల్లి సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ నాగభూషణరావు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags:    

Similar News