ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి.. ఏపీ కాంగ్రెస్

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతుల మహాపాదయాత్రపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవతల రాజధానిగా అమరావతి కీర్తింపబడిందని అలాంటి రాజధానికి వైసీపీ అడ్డుపడటం దుర్మార్గమన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది కాంగ్రెస్ పార్టీ విధానమని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. రైతుల మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. శరీరానికి గుండె ఎలాంటిదో రాష్ట్రానికి సచివాలయం అలాంటిదని చెప్పుకొచ్చారు. దేశంలోని […]

Update: 2021-11-06 05:28 GMT

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతుల మహాపాదయాత్రపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవతల రాజధానిగా అమరావతి కీర్తింపబడిందని అలాంటి రాజధానికి వైసీపీ అడ్డుపడటం దుర్మార్గమన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది కాంగ్రెస్ పార్టీ విధానమని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. రైతుల మహాపాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు.

శరీరానికి గుండె ఎలాంటిదో రాష్ట్రానికి సచివాలయం అలాంటిదని చెప్పుకొచ్చారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక రాజధాని మాత్రమే ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సచివాలయాన్ని విశాఖ తరలించాలన్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదమని విమర్శించారు. విశాఖకు రాజధాని తరలింపు వల్ల రాయలసీమ వాసులకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇకనైనా రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News