తొలి త్రైమాసిక ఫలితాలను ప్రత్యేకంగా చూడాలి : మోతీలాల్ ఓస్వాల్
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రత్యేకంగా చూడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తొలి త్రైమాసికానికి వెల్లడించే కార్పొరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరంలేద్నై, వీటికి ప్రత్యేక నేపథ్యం ఉందని సిద్ధార్థ్ పేర్కొన్నారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అన్ని కంపెనీలు నెలకు పైగానే లాక్‌డౌన్ ఆంక్షల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో త్రైమాసిక ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం సబబు కాదని సిద్ధార్థ్ తెలిపారు. అయితే, కొన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రత్యేకంగా చూడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ బోత్రా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తొలి త్రైమాసికానికి వెల్లడించే కార్పొరేట్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరంలేద్నై, వీటికి ప్రత్యేక నేపథ్యం ఉందని సిద్ధార్థ్ పేర్కొన్నారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అన్ని కంపెనీలు నెలకు పైగానే లాక్‌డౌన్ ఆంక్షల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో త్రైమాసిక ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం సబబు కాదని సిద్ధార్థ్ తెలిపారు. అయితే, కొన్ని కంపెనీలు కరోనా సంక్షోభాన్ని, మార్కెట్ అంచనాలను అధిగమించి ఫలితాలను నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
అలాగే, ఐటీ రంగంపై సానుకూల ధోరణితో ఉన్నామని, రాబోయే రోజుల్లో ఐటీ షేర్లు రాణిస్తాయన్నారు. తొలి త్రైమాసికానికి ఐటీ కంపెనీల ఫలితాలు, యాజమాన్యం స్పందన ఆకర్షణీయంగా ఉన్నాయని సిద్ధార్థ్ పేర్కొన్నారు. అంతేకాకుండా గడిచిన రెండేళ్లుగా ఫార్మా షేర్లు సానుకూలంగానే ఉన్నాయని, మా దృష్టి కూడా దేశీయ ఫార్మా పరిణామాలపైనే ఉందని సిద్ధార్థ్ చెప్పారు. ఇక, దేశీయ ఆర్థిక వ్యవస్థను గమనిస్తే..వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. దీనికి ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు దోహదపడ్డాయని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. వర్షపాతం కూడా మెరుగ్గా ఉండటం, వలస కూలీలు సొంత ఊర్లకు చేరడం వల్ల వినిమయం పెరిగిందని, ఈ అంశాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉందని తెలిపారు.