బతుకమ్మ వేడుకల్లో విషాదం
దిశ, పటాన్‌చెరు: బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుంటలో మునిగి పోయి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు గురువారం రాత్రి బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామంలోని మల్లేశంకుంటలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఆ తర్వాత పూల కోసం వెళ్లి శివ ( 20 […]
దిశ, పటాన్‌చెరు:
బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే కుంటలో మునిగి పోయి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు గురువారం రాత్రి బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామంలోని మల్లేశంకుంటలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఆ తర్వాత పూల కోసం వెళ్లి శివ ( 20 ) అనే వ్యక్తి అందరి కళ్ళ ఎదుటే నీటిలో మునిగిపోయాడు. దీంతో అతన్ని రక్షించేందుకు బంధువులు, స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని శుక్రవారం ఉదయం బయటికి తీసి పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.