‘లక్షకు రూ.20 వేల వడ్డీ, 2 తులాల బంగారం ఇస్తా’

దిశ, మక్తల్ : షేర్ మార్కెట్లో లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. నెలకు రూ.20 వేల వడ్డీ. రెండు తులాల బంగారం.. 4 వేల నగదు.. అంటూ ఓ ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. స్థానికంగా పలుకుడి ఉన్నవారని, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని ఈ చీటింగ్‌ చేశాడో వ్యక్తి. వందల మంది నుంచి డిపాజిట్లు సేకరించిన అతడు.. సుమారు వంద కోట్లకు ఎగనామం పెట్టాడని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ చెందిన షేక్ మహబూబ్ […]

Update: 2021-03-24 03:43 GMT

దిశ, మక్తల్ : షేర్ మార్కెట్లో లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. నెలకు రూ.20 వేల వడ్డీ. రెండు తులాల బంగారం.. 4 వేల నగదు.. అంటూ ఓ ఘరానా మోసానికి పాల్పడ్డాడో కేటుగాడు. స్థానికంగా పలుకుడి ఉన్నవారని, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని ఈ చీటింగ్‌ చేశాడో వ్యక్తి. వందల మంది నుంచి డిపాజిట్లు సేకరించిన అతడు.. సుమారు వంద కోట్లకు ఎగనామం పెట్టాడని తెలుస్తోంది.

ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ చెందిన షేక్ మహబూబ్ సుభాని ఏడాదిన్నర క్రితం మక్తల్‌ వచ్చి నివాసం ఉంటున్నాడు. షేర్ బిజినెస్ చేస్తున్నాని స్థానికులు, రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్నాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం వస్తుందని అందరిని నమ్మించాడు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రూ.20 వేల వడ్డీ నెల రోజుల్లోనే వస్తుందని తెలిపాడు. అలా పెట్టుబడి పెట్టిన వారికి నమ్మకంగా రూ.20 వేల ఇస్తూ వచ్చాడు. ఈ విషయం గ్రామాల్లో వ్యాపించడంతో సుభాని వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు ప్రజలు ఎగపడ్డారు. వచ్చిన డబ్బులతో సమీపంలో భూములు కొనుగోలు చేసినట్లు పట్టాలను మార్డిగేజ్ చేసి చూపించాడు. షేర్ మార్కెట్‌లో వచ్చిన లాభాలతోనే ఎకరాల కొద్ది భూమి కొనుగోలు చేసినట్లు అందరిని నమ్మించాడు. ఈ క్రమంలో వందల మంది సుభాష్ దగ్గర రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా సుభాని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దుకాణానికి, ఇంటికి వెళ్లిన బాధితులకు గుమ్మాలకు తాళాలు దర్శనం ఇచ్చాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. సుభాని వారం రోజుల క్రితం కూడా రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రెండు తులాల బంగారంతోపాటు రూ.4 వేలు ఇస్తానని ఓ స్కీమ్ ను ప్రారంభించి లక్షల రూపాయలు సేకరించినట్లు బాధితులు వాపోతున్నారు. అధిక వడ్డీకి ఆశపడితే ఉన్న సొమ్ము దోచుకెళ్లాడని లబోదిబోమంటున్నారు. ఇంత జరిగినా ఏ ఒక్కరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

Tags:    

Similar News