ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 24 గంటల్లో 1,439 కొత్త కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో 1,311 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా వైరస్ ప్రభావంతో 14 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. 24 గంటల్లో 62,856 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 24 గంటల్లో 1,439 కొత్త కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో 1,311 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా వైరస్ ప్రభావంతో 14 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. 24 గంటల్లో 62,856 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
రోజువారీ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 261, నెల్లూరులో 260, పశ్చిమ గోదావరిలో 182, తూర్పుగోదావరిలో 170 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042కు పెరిగింది. ఇందులో 19,97,454 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌తో 13,964 మంది మృత్యువాతపడ్డారు.