బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు: రఘురామ్ రాజన్

దిశ,వెబ్‌డెస్క్: ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ( privatize), ఎన్‌పీఏ (NPA)లను ఎదుర్కొనేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం ప్రభుత్వానికి సూచించారు. ‘ఇండియన్ బ్యాంక్స్ ; ఎ టైమ్ టు రీఫార్మ్’ పేరుతో రాజన్, మాజీ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య రచయితలుగా రూపొందించిన పత్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ రంగం వృద్ధిని నిర్ధారించడానికి సంస్కరణలు అవసరమని ఆ […]

Update: 2020-09-21 09:40 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ( privatize), ఎన్‌పీఏ (NPA)లను ఎదుర్కొనేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం ప్రభుత్వానికి సూచించారు. ‘ఇండియన్ బ్యాంక్స్ ; ఎ టైమ్ టు రీఫార్మ్’ పేరుతో రాజన్, మాజీ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య రచయితలుగా రూపొందించిన పత్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ రంగం వృద్ధిని నిర్ధారించడానికి సంస్కరణలు అవసరమని ఆ పత్రంలో తెలిపారు.

ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ జాగ్రత్తగా, తగిన వ్యూహంలో భాగంగా చేపట్టవచ్చని చెప్పారు. ఆర్థిక నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యం రెండింటినీ కలిగి ఉన్న ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకురావాలని, అయితే కార్పొరేట్ సంస్థలు గణనీయమైన వాటాలను దక్కించుకోకుండా చూడాలని తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగాన్ని రద్దు చేయడం చాలా అవసరమని పత్రంలో పేర్కొన్నారు.

ఇది బ్యాంకు బోర్డులు, నిర్వహణ స్వతంత్రతకు లాభిస్తుందన్నారు. ఒత్తిడికి గురైన సంస్థలను తిరిగి నిలదొక్కుకునేందుకు ప్రయత్నించడంలో భారత బ్యాంకులకు కీలకమైన సంస్కరణలు అవసరమని సూచించారు. రుణాల అంశంలో పారదర్శకత అందించేందుకు అవసరమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలన్నారు.

Tags:    

Similar News