మద్యం అమ్మకాలపై నిషేదం

దిశ, క్రైమ్ బ్యూరో :  గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శుక్రవారం మద్యం అమ్మకాలపై అధికారులు నిషేదం విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలను నిషేదిస్తూ.. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ సజ్జనార్ నిషేద ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల వరకూ ర్యాలీలపై నిషేదాజ్ఞలు ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సైబరాబాద్ పరిధిలోని కల్లు , వైన్స్ దుకాణాలు, […]

Update: 2020-12-03 11:46 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శుక్రవారం మద్యం అమ్మకాలపై అధికారులు నిషేదం విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలను నిషేదిస్తూ.. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ సజ్జనార్ నిషేద ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల వరకూ ర్యాలీలపై నిషేదాజ్ఞలు ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సైబరాబాద్ పరిధిలోని కల్లు , వైన్స్ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, బార్లు కలిగిన స్టార్ హోటళ్లు, క్లబ్బులు డ్రై డే పాటించాలన్నారు. దీంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని తెలిపారు.

మాదాపూర్ జోన్ లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, ఆర్సీపురం, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్ జోన్ పరిధిలోని బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, జగద్గరి గుట్ట, పేట్ బషీర్ బాద్, దుండిగల్, అల్వాల్, శంషాబాద్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు తదితర ప్రాంతాలలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ , రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ బార్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లు కూడా డ్రై డే పాటించనున్నారు.

Tags:    

Similar News