ఆర్గాన్ డొనేషన్‌లో భాగస్వాములుకండి : జెనీలియా, రితేష్

దేవుడే కాదు.. వైద్యులు కూడా ప్రాణం పోస్తుంటారని తెలుసు. కానీ, సాటి మనిషి కూడా సగటు మనిషికి ప్రాణం పోయొచ్చు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి, నిలువెత్తు ప్రాణాలకు ఆయువు పోస్తాం. అదే కోవలో ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వగలుగుతాం. అయితే ఈ మహా అవయవదాన కార్యక్రమానికి బాలీవుడ్ జంట జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ ముందుకొచ్చారు. బుధవారం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వీరిద్దరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని […]

Update: 2020-07-02 03:27 GMT

దేవుడే కాదు.. వైద్యులు కూడా ప్రాణం పోస్తుంటారని తెలుసు. కానీ, సాటి మనిషి కూడా సగటు మనిషికి ప్రాణం పోయొచ్చు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి, నిలువెత్తు ప్రాణాలకు ఆయువు పోస్తాం. అదే కోవలో ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వగలుగుతాం. అయితే ఈ మహా అవయవదాన కార్యక్రమానికి బాలీవుడ్ జంట జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ ముందుకొచ్చారు. బుధవారం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వీరిద్దరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిందీ జంట.

‘ఆర్గాన్స్ డొనేషన్ గురించి మేమెప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఈ మహత్ కార్యక్రమానికి పూనుకోవడానికి మాలో స్ఫూర్తినింపిన డా. నోజ‌ర్ శెరీర్‌, ఫాగ్సికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాం. ఒకరికి మనమిచ్చే అత్యద్భుతమైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే.. అది ఒకరికి జీవితాన్ని అందించడమే. కాబ‌ట్టి మీరు కూడా ఇత‌రుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ప‌నిలో భాగ‌స్వాములు అవుతామని.. అవ‌య‌వ‌దానం చేస్తామ‌ని ప్లెడ్జ్ చేయండి’ అని బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ జెనీలియా, రితేష్‌ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News