ఒమిక్రాన్ భయం.. వచ్చే పండుగలు, వేడుకలపై దృష్టి

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు పైగా వ్యాపించి భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా న్యూ వేరియంట్ తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న పండుగలు, న్యూయర్ వేడుకల నేపథ్యంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉండగా.. కరోనా నిబంధనల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా టెస్టులు చేయడంతో ఒమిక్రాన్‌ను అడ్డుకట్ట […]

Update: 2021-12-15 01:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు పైగా వ్యాపించి భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా న్యూ వేరియంట్ తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న పండుగలు, న్యూయర్ వేడుకల నేపథ్యంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉండగా.. కరోనా నిబంధనల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా టెస్టులు చేయడంతో ఒమిక్రాన్‌ను అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు.

కానీ, ఈరోజు రాష్ట్రంలో నమోదైన రెండు కేసులు రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు కాకపోవడంతో మరింత టెస్టులు పెంచనున్నట్లు డీహెచ్ ప్రకటించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ పాజిటివ్ బాధితుల్లో ముఖ్యంగా జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం లక్షణాలు గుర్తించామని తెలిపిన డీహెచ్.. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో కేసులు పెరిగితే.. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాల్సి ఉండే అవకాశం ఉంటుందని డీహెచ్ తెలిపారు. అంతేకాకుండా, ఇది వరకు కరోనా వచ్చిన వారికి, వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కూడా ఒమిక్రాన్ సోకిన కేసులు బయటపడ్డాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News