మేడారం జాతరకు ఒమిక్రాన్ గుబులు.. సర్కార్ తర్జన భర్జన
దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు నెలల్లో షురూ కానున్న మేడారం జాతరలో ఒమిక్రాన్ వైరస్వ్యాప్తి పెరగకుండా ఏం చేస్తే బాగుంటుందని సర్కార్ ఆలోచిస్తున్నది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు రానున్న నేపథ్యంలో కొవిడ్ కంట్రోల్‌కు పకడ్భందీగా ప్లాన్‌ను తయారు చేయాలనుకుంటున్నది. భక్తులకు అసౌకర్యం కలుగకుండానే కొవిడ్నిబంధనలతో జాతర జరిగేలా ఏర్పాటు చేయనున్నారు. కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించాలనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: మరో రెండు నెలల్లో షురూ కానున్న మేడారం జాతరలో ఒమిక్రాన్ వైరస్వ్యాప్తి పెరగకుండా ఏం చేస్తే బాగుంటుందని సర్కార్ ఆలోచిస్తున్నది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు రానున్న నేపథ్యంలో కొవిడ్ కంట్రోల్‌కు పకడ్భందీగా ప్లాన్‌ను తయారు చేయాలనుకుంటున్నది. భక్తులకు అసౌకర్యం కలుగకుండానే కొవిడ్నిబంధనలతో జాతర జరిగేలా ఏర్పాటు చేయనున్నారు. కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధించాలనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు మన తర్వాత మేడారం జాతరకు అత్యధిక సంఖ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తులపై కూడా ప్రభుత్వం ఫోకస్పెట్టనున్నది.
అయితే అంతరాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు బోర్డర్లలో టెస్టులు చేయాలనుకుంటున్నది. కానీ వచ్చినోళ్లందరికీ టెస్టులు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఉన్నది. ఎక్కువ జనాలు ఒకేసారి వస్తే హెల్త్ క్యాంపులు ఎలా పెట్టాలని మదనపడుతున్నది. దీంతో సీనియర్ అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటున్నది. గత ఏడాది సంక్రాంతి తర్వాత కేసులు పతాక స్థాయిలోకి చేరిన పరిస్థితులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ములుగు జిల్లాలో స్పెషల్ టీం పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు, వివరాలను సేకరించింది.
అందుకే వాయిదా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల తొలి వారం నుంచే ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకున్నా, అది అమలు కాలేదు. మేడారం జాతర ఏర్పాట్లు జరుగుతున్నందునే తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతర పరిస్థితుల్లో ప్రజలు సహకరించే పరిస్థితి ఉండదని ఆ జిల్లా ముఖ్య అధికారుల సూచనతో తాత్కాలికంగా నిలిచిపోయింది. మరోవైపు ఒమిక్రాన్ప్రభావంతో సిరిసిల్లలో కూడా పెండింగ్ పెట్టేశారు.
ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాల నుంచి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ వాయిదా పడటం గమనార్హం. ప్రజారోగ్య బలోపేతం కోసం ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు సర్కార్ వద్ద ఉండాలని, ఈ మేరకే హెల్త్ ప్రొఫైల్ప్రాజెక్ట్అని సర్కార్ గతంలో చెప్పింది. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఈ ఏడాది జూన్ 8న కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రతీ సారి అది ఏదో కారణంతో పెండింగ్పడుతున్నది.