పాత రేషన్ కార్డులు చెల్లుతాయా?

        ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకంలో భాగంగా దేశం మొత్తం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని, పాత రేషన్ కార్డులు రద్దు చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే ఇది తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది.         పాత రేషన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని, వన్ నేషన్, వన్ […]

Update: 2020-02-07 02:51 GMT

‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకంలో భాగంగా దేశం మొత్తం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని, పాత రేషన్ కార్డులు రద్దు చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే ఇది తప్పుడు వార్త అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది.

పాత రేషన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని, వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ పథకం కింద కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం లేదని ట్వీట్ ద్వారా తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు కట్టడి చేయడానికే పీఐబీ ఒక ఫ్యాక్ట్ చెకింగ్ విభాగాన్ని ఏర్పాటుచేసింది.

దీని గురించి మరింత స్పష్టతనిస్తూ కేంద్ర ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరో ట్వీట్ చేశారు. వన్ నేషన్.. వన్ రేషన్‌కార్డ్ లో భాగంగా ప్రైవేటు సంస్థల సాయంతో కొత్త రేషన్‌కార్డుల జారీ జరగబోతోందంటూ తన మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినట్లుగా వైరల్ అవుతున్న లేఖ నకిలీదని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పాత కార్డులు చెల్లుతాయని ఆయన హామీ ఇచ్చారు.

‘వన్ నేషన్.. వన్ రేషన్‌కార్డు’ పథకంలో భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసేటపుడు దేశంలోని రాష్ట్రాలన్నిటికీ ఒకే రకమైన ఫార్మాట్‌ను కేంద్రం డిజైన్ చేసింది. జూన్ 1, 2020 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకే ఫార్మాట్‌లో ఉన్న రేషన్ కార్డు ద్వారా దేశంలో ఎక్కడి షాపు నుంచైనా సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News