ప్రయాణికులకు షాక్ ఇవ్వనున్న ‘Ola, Uber’ కంపెనీలు..? వచ్చే జనవరి నుంచి అమలు..!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు ‘Ola, Uber ’ వంటి సంస్థలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓలా, ఉబర్ వంటి కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్న ఆటో రైడర్స్ ఇకపై 5 శాతం అధిక చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నట్టు సమాచారం. కేంద్రం ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ రైడ్స్ పై 5% GST విధించాలని నిర్ణయించినట్టు ఉబెర్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం సింగిల్ రైడ్‌‌కు తీసుకుంటున్న చార్జీలపై 5 శాతం జీఎస్టీ కలిపి […]

Update: 2021-12-11 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు ‘Ola, Uber ’ వంటి సంస్థలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓలా, ఉబర్ వంటి కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్న ఆటో రైడర్స్ ఇకపై 5 శాతం అధిక చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నట్టు సమాచారం. కేంద్రం ప్రభుత్వం ఆన్‌లైన్ బుకింగ్ రైడ్స్ పై 5% GST విధించాలని నిర్ణయించినట్టు ఉబెర్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం సింగిల్ రైడ్‌‌కు తీసుకుంటున్న చార్జీలపై 5 శాతం జీఎస్టీ కలిపి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

పెరిగే చార్జీలు జనవరి1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై జీఎస్టీ విధించే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని Ola, Uber కంపెనీలు కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. జీఎస్టీ విధించే నిర్ణయం వలన ఆటో డ్రైవర్లు తమ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని, ఫలితంగా బుకింగ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, GST రివ్వ్యూలో భాగంగా ఆన్‌లైన్ ఆటో రైడ్‌లపై జీఎస్టీ మినహాయింపును కేంద్రం ఇటీవలే ఉపసంహరించుకుంది.

Tags:    

Similar News