ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు : పువ్వాడ

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఆయిల్‌పామ్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం అప్పారావుపేట గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి అందులోని వివిధ విభాగాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన రైతుల సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సీడీలు […]

Update: 2020-08-01 05:19 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఆయిల్‌పామ్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం అప్పారావుపేట గ్రామంలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి అందులోని వివిధ విభాగాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నిర్వహించిన రైతుల సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సీడీలు అందిస్తోందన్నారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్‌లపైన రాయితీలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఎస్ ఆయిల్‌ ఫెడ్ కంచర్ల రామకృష్ణ రెడ్డి , ఎండీ నిర్మల, ఆయిల్ ఫెడ్ మేనేజర్లు శ్రీకాంత్ రెడ్డి(అప్పరావుపేట), బాలకృష్ణ(అశ్వారావుపేట) డివిజన్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారులు జీనుగు మరియన్న, మండల అధికారి సందీప్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News