డిసెంబర్ 7 నుంచి జేఎన్టీయూ పరీక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్‌టీయూ పరిధిలోని బీటెక్, బీఫార్మసీ కోర్సులకు డిసెంబర్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి సెకండ్ మిడ్ టర్మ్ పరీక్షలను నిర్వహిస్తుండగా.. 22 నుంచి 27 వరకు ప్రిపరేషన్ హాలిడేస్‌ను ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ కోర్సుల సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్‌కు సంబంధించి సెకండ్ సెమిస్టర్ అకాడమియ్ ఇయర్‌ను 2021 మార్చి 15న ప్రారంభించనున్నారు. అదే ఏడాది […]
దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్‌టీయూ పరిధిలోని బీటెక్, బీఫార్మసీ కోర్సులకు డిసెంబర్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి సెకండ్ మిడ్ టర్మ్ పరీక్షలను నిర్వహిస్తుండగా.. 22 నుంచి 27 వరకు ప్రిపరేషన్ హాలిడేస్‌ను ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ కోర్సుల సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్‌కు సంబంధించి సెకండ్ సెమిస్టర్ అకాడమియ్ ఇయర్‌ను 2021 మార్చి 15న ప్రారంభించనున్నారు. అదే ఏడాది మే 10 నుంచి 22 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సెకండ్ సెమిస్టర్ చివరి పరీక్షలను 2021 ఆగస్టు 9 నుంచి 21 వరకు నిర్వహిస్తారు.