రైతులు నష్టపోకుండా చర్యలు
దిశ, రంగారెడ్డి: ఉద్యానవన పంటలు వేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం జిల్లా ఉద్యానవన శాఖాధికారులు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్‌లో పర్యటించి పంటను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం డివిజన్లలో శేరిగుడం, చింతలగూడెం గ్రామంలోని నరసింహారెడ్డి 15 ఎకరాలు, వీరారెడ్డి 7 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేశారు. అదేవిధంగా మహేశ్వరంలోని రావిర్యాల, తుక్కుగుడా గ్రామంలోని కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి పంటలను ఉద్యానవనం శాఖ అధికారులు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో సరిపడా కూరగాయలు దిగుమతి […]
దిశ, రంగారెడ్డి:
ఉద్యానవన పంటలు వేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం జిల్లా ఉద్యానవన శాఖాధికారులు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్‌లో పర్యటించి పంటను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం డివిజన్లలో శేరిగుడం, చింతలగూడెం గ్రామంలోని నరసింహారెడ్డి 15 ఎకరాలు, వీరారెడ్డి 7 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేశారు. అదేవిధంగా మహేశ్వరంలోని రావిర్యాల, తుక్కుగుడా గ్రామంలోని కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి పంటలను ఉద్యానవనం శాఖ అధికారులు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో సరిపడా కూరగాయలు దిగుమతి ఉందని అంచనా వేశారు. ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పర్మినెంట్ పాసులు అందించారు. జిల్లాలో ద్రాక్ష తోటలు బాగానే ఉన్నాయి. ఈ ద్రాక్ష ఇప్పుడు ఇప్పుడే కోతకు వస్తున్నాయి. జిల్లాలో సుమారుగా 200 టన్నుల దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఈ పంటకు ధర వచ్చేలా ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి గిట్టుబాటు కలిపిస్తామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్ సునంద రాణి అన్నారు. ఈ పర్యవేక్షణలో అధికారులు బి.కనకలక్ష్మి, కె.యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు.
Tags: Officials, taking steps, prevent, crop damage, RANGAREDDY, FORMERS