అధికారుల నిర్లక్ష్యం.. వర్షాల వేళ చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం..

దిశ, కీసర : ప్రధాన రహదారి రోడ్డు పక్కనే చెత్త వేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కీసర గ్రామపంచాయతీ పరిధిలోని దాయార రోడ్డులోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిత్యం రోడ్లు శుభ్రం చేయించాల్సిన పంచాయతీ సిబ్బంది చెత్తను తొలగించకపోవటంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోతోంది. రోడ్డు పక్కన చెత్త ఉండటం, వర్షాలు కురుస్తుండటంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. రోడ్డుపై వెళ్లే ప్రజలు, ప్రక్కనే ఉన్న అంగన్‌వాడీ […]

Update: 2021-09-22 02:12 GMT

దిశ, కీసర : ప్రధాన రహదారి రోడ్డు పక్కనే చెత్త వేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కీసర గ్రామపంచాయతీ పరిధిలోని దాయార రోడ్డులోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిత్యం రోడ్లు శుభ్రం చేయించాల్సిన పంచాయతీ సిబ్బంది చెత్తను తొలగించకపోవటంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోతోంది.

రోడ్డు పక్కన చెత్త ఉండటం, వర్షాలు కురుస్తుండటంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. రోడ్డుపై వెళ్లే ప్రజలు, ప్రక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలోని పిల్లలు దుర్వాసన భరించలేక ముక్కులు మూసుకుంటున్నారు. చిన్న పిల్లలు అంటురోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కీసరలో వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు..

ఇక్కడే ప్రతీ సోమవారం కూరగాయల సంత నడుస్తూ ఉంటుంది. మంగళవారం మార్కెట్ యార్డ్‌ను శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కన ఉన్న చెత్తను తొలగించాలని, మార్కెట్ యార్డ్‌ను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News