కృత్రిమ ఇసుక ఫిల్టర్లుపై అధికారుల దాడులు
దిశ, కంది : అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. కంది తహశీల్దార్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బ్యాతోల్, ఆరుట్ల, చిద్రుప్ప, ఎర్దనుర్ గ్రామ శివార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను ఆర్ ఐ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఇసుక ఫిల్టర్లు ఉపయోగించే పైపులను, ఇతర సామాగ్రిని తగల పెట్టడం జరిగింది. ఈ దాడుల్లో రెవెన్యూ […]
దిశ, కంది : అక్రమంగా తయారు చేస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. కంది తహశీల్దార్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బ్యాతోల్, ఆరుట్ల, చిద్రుప్ప, ఎర్దనుర్ గ్రామ శివార్లలో అక్రమంగా నిర్వహిస్తున్న కృత్రిమ ఇసుక ఫిల్టర్లను ఆర్ ఐ సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం అక్కడ ఇసుక ఫిల్టర్లు ఉపయోగించే పైపులను, ఇతర సామాగ్రిని తగల పెట్టడం జరిగింది. ఈ దాడుల్లో రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.