మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌సింగ్ ప్రమాణం నేడు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు (సోమవారం) రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బల నిరూపణకు కమల్‌నాథ్ ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో […]
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు (సోమవారం) రాత్రి 7గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బల నిరూపణకు కమల్‌నాథ్ ప్రభుత్వం సిద్ధపడలేదు. ఈ విషయమై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అసెంబ్లీలో తక్షణం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. కానీ, బలనిరూపణకు ముందే ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
Tags: bjps, shivrajsingh chouhan, likely to take, oath, at 7pm as,madhyapradesh, chief minister,