డాక్టర్ చెంప చెళ్లుమనిపించిన నర్స్.. అదే కారణమంటున్న మేజిస్ట్రేట్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువవతుంది. ఒత్తిడికి లోనైనా వైద్యులు తమ కోపాన్ని తమ కింద స్థాయి వారిపై చూపిస్తున్నారు. దీంతో కింద స్థాయి ఉద్యోగులు ఒత్తిడితో పాటు అవమానాలకు కూడా గురవుతున్నారు. తాజాగా పని ఒత్తిడి వలన డాక్టర్ పై చేయి చేసుకుంది ఒక నర్స్.. నర్స్ చేయిచేసుకుందని ఆమెపై దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువవతుంది. ఒత్తిడికి లోనైనా వైద్యులు తమ కోపాన్ని తమ కింద స్థాయి వారిపై చూపిస్తున్నారు. దీంతో కింద స్థాయి ఉద్యోగులు ఒత్తిడితో పాటు అవమానాలకు కూడా గురవుతున్నారు. తాజాగా పని ఒత్తిడి వలన డాక్టర్ పై చేయి చేసుకుంది ఒక నర్స్.. నర్స్ చేయిచేసుకుందని ఆమెపై దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ఈ దారుణ ఘటన యూపీలో రామ్ పూర్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది.
రామ్ పూర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా వైద్యులు, నర్స్ లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒక పేషేంట్ డెత్ సర్టిఫికెట్ విషయంలో డాక్టర్ కి, నర్స్ కి మధ్య గొడవ జరిగింది. దీంతో సహనం నశించిన నర్స్, డాక్టర్ చెంప చెళ్లుమనిపించింది. వెంటనే డాక్టర్, నర్స్ పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఈ తతంగానంత అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా స్పందించారు. “గొడవ అనంతరం వారిద్దరిని విడిగా విచారించామని, పని ఒత్తిడి వలనే తాము అలా ప్రవర్తించామని తెలిపారని” తెలిపారు.