ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 37,381మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 212మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,81,273కి చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,098గా ఉంది. ప్రస్తుతం 3,423 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,70,752మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 410 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,16,57,884మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం […]

Update: 2020-12-28 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 37,381మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 212మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,81,273కి చేరింది. నలుగురు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,098గా ఉంది. ప్రస్తుతం 3,423 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,70,752మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 410 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,16,57,884మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 13కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 42, తూర్పుగోదావరిలో 21, గుంటూరులో 53, కడపలో 9, కృష్ణా జిల్లాలో 32, కర్నూలులో 4, నెల్లూరులో 7, ప్రకాశంలో 8, శ్రీకాకుళంలో 5, విశాఖపట్నంలో 13, పశ్చిమగోదావరిలో 5 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News