ఏపీలో కరోనా విలయతాండవం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,996 పాజిటివ్‌లు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 64వేల 142కు చేరింది. ఇవాళ 83మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,378కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని లక్షా 70వేల 924 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇవాళ 9,499 మంది ఇంటికి […]

Update: 2020-08-13 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,996 పాజిటివ్‌లు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 64వేల 142కు చేరింది. ఇవాళ 83మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,378కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90,840 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని లక్షా 70వేల 924 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇవాళ 9,499 మంది ఇంటికి వెళ్లిపోయారు.

24గంటల్లో 55,692 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు కరోనా శాంపిల్స్ పరీక్షించిన వారి సంఖ్య 27,05,459కి చేరింది. ఇవాళ కరోనా మహమ్మారితో తూర్పుగోదావరి జిల్లాలో 10మంది ప్రాణాలు కోల్పోగా, గుంటూరులో 10, అనంతపురం 8, కడప 7, చిత్తూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, విశాఖ 6, విజయనగరం 5, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News