195 దేశాలు తిరిగి చరిత్ర సృష్టించిన తెలుగు వ్యక్తి.. ఇంతకూ అతను ఎవరో తెలుసా..?

ఓ తెలుగు వ్యక్తి అరుదైన ఘనతను సాధించాడు.

Update: 2024-08-05 13:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ తెలుగు వ్యక్తి అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 195 దేశాలను చుట్టివచ్చి చరిత్రలో ఒకరిగా నిలిచాడు. ప్రపంచ పర్యాటకుడిగా నిలిచిన ఇతడు.. తను సంపాదన మొత్తం టూరిజానికే ఖర్చు చేయడం గమనార్హం. ఇంతకూ అతడు ఎవరేనేగా మీ కుతుహలం.. ఇదిగో ఆ ప్రపంచ పర్యాటకుడి వివరాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాకు చందిన రవి అనే వ్యక్తి చరిత్ర సృష్టించాడు. రవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ చదివాడు. ఇప్పటి వరకు అతను మొత్తం 195 దేశాలకు పైగా ప్రయాణించి గొప్ప ఫీట్ సాధించాడు. అతను మొదట ప్రయాణించిన దేశం భూటాన్ కాగా, చివరిగా వెనిజులాలో 9 రోజులు గడిపాడు. ఇది అతని 195వ దేశంగా గుర్తించబడింది. ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో రవిప్రభు ఒకరు. ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణించిన తెలుగు వ్యక్తిగా కూడా రవి చరిత్ర సృష్టించాడు.

ఈ సందర్భంగా రవి "FTCCI Red Hills" అనే మీడియాతో మాట్లాడూతూ... తాను గత 20 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నాని తెలిపారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని చెప్పారు. తాను ఈ ఘనత సాధించడానికి 27 ఏళ్లు కష్టపడ్డానని, 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశానని వెల్లడించారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఆ పర్యటనలకే పెట్టుబడిగా పెట్టానని అన్నారు. అలాగే తాను తెలుగు టూరిజం ప్రమోషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు రాజస్థాన్, కేరళ మరియు ఒరిస్సా టూరిజం ప్రమోషన్లను చాలా చూస్తానని చెప్పారు. కానీ, తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒక్క టూరిజం ప్రమోషన్ కూడా చూడలేదని రవి పేర్కొన్నారు.

కాగా... రవి 1996లో అమెరికా వెళ్లి అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నారు. ఇతనికి ‘రవి తెలుగు ట్రావెలర్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. రవికి యూట్యూబ్ చానల్లో 7.86 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ వేదికగా అతను వెళ్లిన ప్రతి దేశం యొక్క సాంస్కృతిక, జీవన శైలి, అక్కడే ఉండే పరిస్థితులను అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు.

Tags:    

Similar News