మద్రాస్ ఐఐటీకి రూ.228 కోట్ల విరాళం

తాను చదువుకున్న విద్యాలయానికి ఏకంగా రూ.228 కోట్ల విరాళాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నాడు ఓ తెలుగు తేజం.

Update: 2024-08-05 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : తాను చదువుకున్న విద్యాలయానికి ఏకంగా రూ.228 కోట్ల విరాళాన్ని అందించి గొప్ప మనసు చాటుకున్నాడు ఓ తెలుగు తేజం. ఏపీలోని బాపట్లకు చెందిన కృష్ణా చివుకుల తన గ్రాడ్యుయేషన్ ఐఐటీ బాంబేలో చదివాక, 1970లో ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐటీ మద్రాసులో పూర్తి చేశారు. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన కృష్ణా వివిధ సంస్థల్లో ఉన్నతమైన పదవుల్లో ఉద్యోగాలు చేశారు. అనంతరం న్యూయార్క్ కేంద్రంగా 'శివ టెక్నాలజీస్' నెలకొల్పి, మాస్ స్పెక్ట్రోస్కోపిక్ సాంకేతికతను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచారు. 1997 తర్వాత భారత్ లో 'ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో నెలకొల్పిన సంస్థకు కృష్ణా ఛైర్మన్ గా ఉన్నారు. ఈ సంస్థ టర్నోవర్ మనదేశంలో వెయ్యికి పైగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న వీరు ఈ నెల జరిగే విరాళాలిచ్చే దాతల ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనడానికి మద్రాస్ రానున్నారు. కార్పొరేట్ సామాజిక భాద్యత కింద ముందు నుండి కూడ మద్రాస్ ఐఐటి మీద ఎంతో దాతృత్వం ప్రదర్శిస్తున్న కృష్ణా.. ఇంతక ముందే ఈ యూనివర్సిటీకి పదుల కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఇపుడు ఏకంగా వందల్లో ఇస్తున్నారు. ఈ నిధులను పరిశోధన వసతుల పెంపుకు ఉపయోగించనున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. 


Similar News