బీసీల డిమాండ్లపై మీరు దిగైనా రావాలి..లేదా దిగైనా పోవాలి -సీఎం రేవంత్

బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm revanth reddy) తన గళాన్ని ఢిల్లీ గడ్డపై

Update: 2025-04-02 10:41 GMT

దిశ వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm revanth reddy) తన గళాన్ని ఢిల్లీ గడ్డపై వినిపించారు. బీసీ గర్జన నిప్పు రవ్వల రగిలి దేశం మొత్తం వ్యాపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీ గద్దమీద ఎలా ఉంటారో మేము చూస్తామని మోడీ ( Modi) ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. బీసీల డిమాండ్లకు మీరైనా దిగి రావాలి లేదా దిగైన పోవాలి అంటూ అల్టిమేట్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి (Cm revanth reddy). ఇవాళ ఢిల్లీలో బీసీ గర్జన జరిగింది. ఇందులో కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా... ఎన్నో చట్టాలను ప్రధాని మోడీ ప్రజల మీద రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రోజు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అందరు మద్దతు తెలుపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీనవర్గాల రిజర్వేషన్లు పెంచితే.. మీకు వచ్చిన బాధ ఏంటి? అంటే మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు బండి సంజయ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బండి సంజయ్ ( Bandi Sanjay)... బీసీల ( BC) కోసం ప్రాణాలు ఇస్తానని అంటున్నాడు.. తమకు ప్రాణాలు వద్దు రిజర్వేషన్లు పెంచితే చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ గద్దే దిగి మీరు మా గల్లీలోకి రావాల్సిందే అంటూ హెచ్చరించారు. బీసీలకు న్యాయం చేస్తే ప్రధాని నరేంద్ర మోడీని సన్మానిస్తామని కూడా తెలిపారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతిస్తే పది లక్షల మందితో సభ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీని సన్మానిస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News