ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో వివిధ రకాల కోర్సులు.. పీజీ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాముల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇగ్నోలో ప్రవేశం పొందటానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని ఆయన సూచించారు. ఆయా ప్రోగ్రాముల్లో […]

Update: 2020-07-21 05:08 GMT
ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
  • whatsapp icon

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో వివిధ రకాల కోర్సులు.. పీజీ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాముల్లో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇగ్నోలో ప్రవేశం పొందటానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలని ఆయన సూచించారు. ఆయా ప్రోగ్రాముల్లో ప్రవేశం కొరకు విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఇగ్నోవెబ్‌సైట్ ద్వారా అడ్మిషన్లు పొందాలని కోరారు. పూర్తి వివరాలకు www.ignou.ac.in సంప్రదిచాలని, అలాగే rchyderabad@ignou.ac.in మెయిల్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News