నెహ్రూ కూడా లడాఖ్‌లో పర్యటించారు: శరద్ పవార్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లడాఖ్ పర్యటన తనకు ఆశ్చర్యం కలిగించలేదని, 1962 యుద్ధం తర్వాత నెహ్రూ కూడా పర్యటించాడని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అప్పటి రక్షణ మంత్రి యశ్వంత్‌రావ్ చవాన్ కూడా లడాఖ్ వెళ్లొచ్చాడని తెలిపారు. పూణెలో విలేకరులతో మాట్లాడుతూ, 1993లో తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు చైనా వెళ్లి ఓ ఒప్పందంపై సంతకం పెట్టారని, ఆ ఒప్పందం కిందే ఇరుదేశాల బలగాలు సరిహద్దు నుంచి ఉపసంహరణ జరిగిందని […]
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లడాఖ్ పర్యటన తనకు ఆశ్చర్యం కలిగించలేదని, 1962 యుద్ధం తర్వాత నెహ్రూ కూడా పర్యటించాడని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అప్పటి రక్షణ మంత్రి యశ్వంత్‌రావ్ చవాన్ కూడా లడాఖ్ వెళ్లొచ్చాడని తెలిపారు. పూణెలో విలేకరులతో మాట్లాడుతూ, 1993లో తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు చైనా వెళ్లి ఓ ఒప్పందంపై సంతకం పెట్టారని, ఆ ఒప్పందం కిందే ఇరుదేశాల బలగాలు సరిహద్దు నుంచి ఉపసంహరణ జరిగిందని గుర్తుచేశారు. ఆయుధ రహిత ఒప్పందమూ కుదరిందని చెప్పారు. తాజా ఉద్రిక్తతలను తొలగించడానికి దౌత్యమార్గాల్లో చర్చలు జరపాలని, అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తేవాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీకి సూచించినట్టు వివరించారు. కాగా, మోడీ లడాఖ్ పర్యటనపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 1962 యుద్ధంలో భారత్‌పై చైనా గెలిచిందని, అయినప్పటికీ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సరిహద్దుకు వెళ్లి సైన్యంలో స్థైర్యాన్ని నింపి వచ్చారని తెలిపారు. అప్పటి రక్షణ మంత్రి యశ్వంత్ చవాన్ కూడా వెళ్లాడని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య వివాదం తలెత్తితే అందులో బలగాల ప్రమేయముంటే దేశ నాయకత్వం తప్పకుండా వాళ్ల దగ్గరికెళ్లి వారిలో స్థైర్యాన్ని నింపాల్సిన అవసరముంటుందని వివరించారు. అందుకే ప్రధాని మోడీ లడాఖ్ పర్యటన తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని తెలిపారు.