టిక్‌టాక్ కొనుగోలుపై నో ఇంట్రెస్ట్ : యాపిల్
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ యాప్ కొనుగోలుకు సంబంధించి తమకు ఇంట్రెస్ట్ లేదని ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ తెలిపింది. టిక్‌టాక్ కొనుగోలుకు యాపిల్ ప్రయత్నిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఈ విషయమై ప్రస్తుతం టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ మధ్య చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ చర్చలు కొనసాగుతుండగానే.. యాపిల్ ప్రస్తావన రావడంతో సదరు కంపెనీ మంగళవారం స్పందించింది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. […]
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ యాప్ కొనుగోలుకు సంబంధించి తమకు ఇంట్రెస్ట్ లేదని ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ తెలిపింది. టిక్‌టాక్ కొనుగోలుకు యాపిల్ ప్రయత్నిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఈ విషయమై ప్రస్తుతం టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్ మధ్య చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే.
ఓవైపు ఈ చర్చలు కొనసాగుతుండగానే.. యాపిల్ ప్రస్తావన రావడంతో సదరు కంపెనీ మంగళవారం స్పందించింది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. కాగా, మైక్రోసాఫ్ట్‌తో టిక్‌టాక్ డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 45 రోజుల గడువు విధించాడు. అంతకుముందే ఆయన టిక్‌టాక్ పై బ్యాన్ విధించే అవకాశం ఉందని పలుమార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ భవిత్యంపై అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.