కిమ్ మరో క్షిపణి పరీక్ష.. అమెరికా గుండెల్లో మొదలైన గుబులు

దిశ, వెబ్ డెస్క్ : ఇరు కొరియాల మద్య దాయాదుల పోరు నడుస్తూనే ఉంది. ఉత్తర కొరియా మరో సారి ప్రపంచం గుండెల్లో బాంబు పేల్చింది. మంగళవారం ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష చేసింది. భవిష్యత్తులో ద.కొరియాతో శాంతి చర్చలు జరుగుతాయని ఉ.కొరియా గత శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించారు. ప్రపంచానికి ఇప్పటికీ ప్రశ్నార్ధకంగా మారిన కిమ్ మరో సారి క్షిపణి పరీక్షలు చేసి అమెరికాకు […]

Update: 2021-09-28 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇరు కొరియాల మద్య దాయాదుల పోరు నడుస్తూనే ఉంది. ఉత్తర కొరియా మరో సారి ప్రపంచం గుండెల్లో బాంబు పేల్చింది. మంగళవారం ఉ.కొరియా మరో క్షిపణి పరీక్ష చేసింది. భవిష్యత్తులో ద.కొరియాతో శాంతి చర్చలు జరుగుతాయని ఉ.కొరియా గత శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించారు. ప్రపంచానికి ఇప్పటికీ ప్రశ్నార్ధకంగా మారిన కిమ్ మరో సారి క్షిపణి పరీక్షలు చేసి అమెరికాకు పెద్ద సవాలు విసిరాడు. ఉత్తర కొరియా భూభాగం నుంచి తూర్పు వైపు సముద్రం లోకి ఈ ప్రయోగం జరిగిందని అమెరికా నిఘా విభాగం తెలిపింది. ఈ విషయాన్న జపాన్, దక్షిణ కొరియాలు కూడా దృవీకరించాయి. అయితే ఈ క్షిపణి బాలిస్టిక్ క్షిపణిగా అమెరికా అనుమానిస్తోంది.

కరోనా కారణంగా కొంతకాలం సైలెంట్ గా ఉన్న కిమ్ ఇప్పుడు ఆగమేఘాల మీద అణు పరీక్షలకు పూనుకుంటున్నాడు. అప్పట్లో అమెరికా దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేసి కిమ్ పని పడదాం అనుకున్నారు కానీ అవేవీ ఫలించలేదు. ఈ నెల మొదట్లో ఉ.కొరియా బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. గత శుక్ర, శనివారాల్లో ఉ.కొరియా నియంత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ మాట్లాడుతూ.. నిబంధనలు పూర్తి చేస్తే చర్చలు, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మర్నాడు ఆమె మరోసారి ద.కొరియా పై ప్రకటన చేశారు. పొరుగు దేశం ఉద్రిక్తతలు పెంచే విధానాలను, ద్వంద్వ వైఖరిని ఆపేయాలని ఆమె కోరారు. దీనికి దక్షిణ కొరియా యూనిఫికేషన్‌ మంత్రి స్పందిస్తూ కిమ్‌ యో జోంగ్‌ ప్రకటన అర్థవంతంగానే ఉన్నా.. చర్చలకు ముందే ఇరు దేశాల కమ్యూనికేషన్లను పునరుద్ధరించాలని సూచించారు. దీనికి ఉ.కొరియా స్పందించలేదు.

Tags:    

Similar News