యూనికార్న్ హోదా సాధించిన మొదటి ప్రాప్‌టెక్ కంపెనీ నోబ్రోకర్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ కంపెనీ నోబ్రోకర్ అరుదైన ఘనతను సాధించింది. మంగళవారం కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా జనరల్ అట్లాంటీక్, టైగర్ గ్లోబల్ సహా పలు పెట్టుబడిదారుల నుంచి రూ. 1,575 కోట్ల నిధులను సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లతో యూనికార్న్ హోదాను సాధించింది. అంతేకాకుండా ఈ హోదాను దక్కించుకున్న మొదటి ప్రాపర్టీ టెక్ రంగ కంపెనీగా అవతరించింది. ‘సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఈ పెట్టుబడులను […]

Update: 2021-11-23 09:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ కంపెనీ నోబ్రోకర్ అరుదైన ఘనతను సాధించింది. మంగళవారం కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా జనరల్ అట్లాంటీక్, టైగర్ గ్లోబల్ సహా పలు పెట్టుబడిదారుల నుంచి రూ. 1,575 కోట్ల నిధులను సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లతో యూనికార్న్ హోదాను సాధించింది. అంతేకాకుండా ఈ హోదాను దక్కించుకున్న మొదటి ప్రాపర్టీ టెక్ రంగ కంపెనీగా అవతరించింది.

‘సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగానే ఈ పెట్టుబడులను సమీకరించామని, తాజా నిధులతో కంపెనీ ఇప్పటివరకు రూ. 2,690 కోట్ల నిధులను సేకరించింది. ఈ నిధుల కోసం కంపెనీ వ్యవస్థాపకులు వాటాను తగ్గించుకున్నామని, అయినప్పటికీ నియంత్రణ వాటాను కలిగి ఉన్నామని’ నోబ్రోకర్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ అగర్వాల్ అన్నారు. ఈ నిధులను వినియోగించి ఇప్పటికే ఉన్న 6 నగరాల్లో మరింత లోతుగా వెళ్లేందుకు, అదనంగా మరో 50 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఉపయోగిస్తామని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News