డెమొక్రసీ చాంపియన్స్.. ఫిలిప్సీన్స్, రష్యా జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి
దిశ, ఫీచర్స్: నోబెల్ కమిటీ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. మీడియా పారదర్శకతపై నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో కమిటీ తీసుకున్న నిర్ణయం.. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిజం పాత్రను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ క్రమంలో మరియా రెస్సా(ఫిలిప్పీన్స్), డిమిత్రి మురాటోవ్(రష్యా)కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన కమిటీ.. వారిని డెమొక్రసీ చాంపియన్స్‌గా వర్ణించింది. CNN ఫార్మర్ ఇన్వెస్టిగేట్ రిపోర్టర్ అయిన రెస్సా.. మనీలా బేస్డ్ న్యూస్ సైట్ ‘రాప్లర్’ను స్థాపించారు. ఫిలిప్పీన్స్ […]
దిశ, ఫీచర్స్: నోబెల్ కమిటీ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. మీడియా పారదర్శకతపై నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో కమిటీ తీసుకున్న నిర్ణయం.. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిజం పాత్రను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ క్రమంలో మరియా రెస్సా(ఫిలిప్పీన్స్), డిమిత్రి మురాటోవ్(రష్యా)కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన కమిటీ.. వారిని డెమొక్రసీ చాంపియన్స్‌గా వర్ణించింది.
CNN ఫార్మర్ ఇన్వెస్టిగేట్ రిపోర్టర్ అయిన రెస్సా.. మనీలా బేస్డ్ న్యూస్ సైట్ ‘రాప్లర్’ను స్థాపించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే దుర్వినియోగ పాలనను లక్ష్యంగా చేసుకున్న ఆమె.. డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వ అవినీతిలో భాగంగా పెద్ద ఎత్తున చేసిన హత్యలను బహిర్గతం చేసింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు ఫేస్‌బుక్ కలిగించే ప్రమాదాలను గుర్తించిన మొదటి జర్నలిస్టులలో ఆమె కూడా ఒకరు. ఫిలిప్పీన్స్‌లో ఫేస్‌బుక్ తన మొబైల్ యాప్ ద్వారా ఉచిత డేటాను అందిస్తుండగా.. చాలా మంది ప్రజలు ఫేస్‌బుక్‌లోనే గడుపుతున్నారు. అంతేకాదు డ్యూటెర్టే ఫాలోవర్స్.. ఫేస్‌బుక్‌లో రాజకీయ ప్రత్యర్థుల గురించి ఫాల్స్ ఇన్‌ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని గుర్తించి ‘ప్రపంచంలోనే లార్జెస్ట్ న్యూస్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఫేస్‌బుక్ ఇంకా గేట్‌కీపర్‌గా ఉండటం ప్రమాదకరమని హెచ్చరించింది. ఫలితంగా రెస్సా, రాప్లర్ మీడియా.. ద్వేషపూరిత ఆన్‌లైన్ ప్రచారానికి గురయ్యారు. ఇందులో స్త్రీ వ్యతిరేక దాడులు కూడా ఉండగా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్ రీసెర్చ్ ప్రకారం ఈ హింసకు ఫేస్‌బుక్ మెయిన్ రీజన్ అని తెలిసింది. ఈ క్రమంలోనే జూన్ 2020లో రెస్సా నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిందని ఆరోపించిన ప్రభుత్వం.. ఆమెతో పాటు సహోద్యోగులపై పలు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దోషులుగా చిత్రీకరించి రాఫ్లర్ టాక్స్‌లు, ఫైనాన్షియల్ ట్ర్సాన్జాక్షన్స్‌పై ఇన్వెస్టిగేట్ చేసింది.
రష్యా ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసిన పొలిట్కోవ్..
ఇక రెస్సాతో కలిసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న రష్యాకు చెందిన డిమిత్రి మురాటోవ్.. మాస్కో బేస్డ్ వార్తాపత్రిక నోవయా గెజిటా సహ వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు. ఈయన వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన, అవినీతి, అధికార దుర్వినియోగాన్ని బహిర్గతం చేశారు. ఈ క్రమంలోనే డిమిత్రి సహోద్యోగుడు అన్నా పొలిట్కోవ్ స్కాయ చనిపోగా.. ఆయన డెత్ యానివర్సరీ తర్వాతి రోజు నోబెల్ బహుమతి ప్రకటన రావడం విశేషం. కాగా చెచ్‌న్యాలో జరిగిన హింసాకాండ, హత్యల గురించి డాక్యుమెంట్ చేయడంలో పొలిట్కోవ్ చాలా ఏళ్లు గడిపాడు.
కీలక పరిణామం
పౌర సమాజాన్ని స్తంభింపజేసేందుకు, విమర్శనాత్మక స్వరాలను అణిచివేసేందుకు రష్యన్ అధికారులు దేశంలో స్వతంత్ర మీడియాను తొలగించేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టైమ్‌లోనే డిమిత్రికి శాంతి బహుమతి రావడం కీలకపరిణామం. కాగా 2000ల ప్రారంభంలో రష్యా ప్రభుత్వం స్వతంత్ర టెలివిజన్‌ను తరిమికొట్టింది. ఇటీవలి కాలంలో స్వతంత్ర ఆలోచనలు కలిగిన సంపాదకులు, విలేఖరులు మెయిన్ స్ట్రీమ్ అవుట్‌లెట్‌ల నుంచి బయటకు నెట్టివేయబడగా.. ఈ రిపోర్టర్లు స్వతంత్ర రిపోర్టింగ్ కోసం న్యూ ప్లాట్‌ఫామ్స్ స్థాపించారు. ఇక తాజాగా మీడియా ముందు మాట్లాడిన మురటోవ్.. నోబెల్ శాంతి బహుమతి తన యోగ్యత కాదని, ఇది నోవాయ గెజిటాకు దక్కిన గౌరవమని తెలిపారు. ప్రజల మాట్లాడే స్వేచ్ఛా హక్కును కాపాడటం కోసం మరణించిన మీడియా మిత్రులకు ఈ బహుమతిని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా లేటెస్ట్‌గా తొమ్మిది మంది జర్నలిస్ట్‌లను ఫారిన్ ఏజెంట్స్‌గా ముద్రవేసిన రష్యా ప్రభుత్వం.. బహుమతి ప్రకటించిన కొద్ది గంటలకే తన టాక్సిక్ ట్రయల్స్‌ను మొదలుపెట్టింది.