తెలంగాణ ఉద్యోగులకు మళ్ళీ నిరాశే..!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగులకు మళ్ళీ నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు బడ్జెట్లో కనిపించలేదు. అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్మెంట్ను దాదాపు 30 శాతానికి పెంచితే రూ. 9 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని ఆర్థిక శాఖ లెక్కలేసింది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేయడంతో… బడ్జెట్లో వివరిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ ఈ […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగులకు మళ్ళీ నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు బడ్జెట్లో కనిపించలేదు. అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్మెంట్ను దాదాపు 30 శాతానికి పెంచితే రూ. 9 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని ఆర్థిక శాఖ లెక్కలేసింది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేయడంతో… బడ్జెట్లో వివరిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ ఈ బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావనే లేదు.
పీఆర్సీకి సంబంధించిన ఏ అంశం బడ్జెట్లో లేదు. దీంతో ఉద్యోగ వర్గాలు కొంత నిరుత్సాహానికి గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై కొన్ని నెలలుగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీనిపై బడ్జెట్లో నిధులు ఉంటాయని ఉద్యోగులు అంచనా వేశారు. వేతన సవరణతో పాటుగా పదవీ విరమణ పెంపు కూడా బడ్జెట్ ప్రసంగంలో ఉంటుందనుకున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు.