ఇంటికి అడ్డంగా బండరాళ్లు.. వృద్ధ దంపతులకు దారేది
దిశ,హుజురాబాద్ : ఇంటికి రాను పోను దారిలేక ఆ వృద్ధ దంపతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని మహంకాళి దేవస్థానం సమీపంలో కనుకుంట్ల రామస్వామి, రాదమ్మ దంపతులు 60 ఏళ్లుగా వారి సొంతింట్లో నివాసముంటున్నారు. ఈ ఇంటికి తూర్పు ఈశాన్యం బాట ఉంది. అయితే, ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం తనదేనంటూ ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వృద్ధులను తరచూ బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఆధారాలు, హద్దులు లేనప్పటికీ రామ […]
దిశ,హుజురాబాద్ : ఇంటికి రాను పోను దారిలేక ఆ వృద్ధ దంపతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకేపల్లి గ్రామంలోని మహంకాళి దేవస్థానం సమీపంలో కనుకుంట్ల రామస్వామి, రాదమ్మ దంపతులు 60 ఏళ్లుగా వారి సొంతింట్లో నివాసముంటున్నారు. ఈ ఇంటికి తూర్పు ఈశాన్యం బాట ఉంది. అయితే, ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం తనదేనంటూ ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వృద్ధులను తరచూ బెదిరింపులకు గురిచేస్తున్నాడు.
ఆధారాలు, హద్దులు లేనప్పటికీ రామ స్వామి ఇంటికి వెళ్లేందుకు దారి లేదంటూ అడ్డుగా బండరాళ్ళతో గోడను ఏర్పాటు చేశాడు. దీంతో వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షపు నీరు కూడా ఇంట్లోకి చేరడంతో నానా అవస్థలు పడ్డారు. ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండానే సదరు వ్యక్తి కక్షపూరితంగా తమను ఇబ్బంది పెడుతున్నారని వృద్ధులు కన్నీరుమున్నీరయ్యారు.