బంగారు తెలంగాణలో దైవ దర్శనానికి దారేది..

దిశ, మంగపేట : చిన్నపాటి వర్షం పడితే చాలు దైవ దర్శనానికి మోకాళ్లోతు బురద నీళ్లలో ఆలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం చిన్న వర్షానికే చిత్తడిగా మారుతుంది. ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని స్వపరిపాలన కోసం తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ పాలకులు కూడా ఏడేళ్లుగా తట్టెడు మట్టిపోసిన పాపానపోలేదని మండల కేంద్రం ప్రజలు విమర్శిస్తున్నారు. 2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు రూ.3 కోట్లు పెట్టి […]

Update: 2021-07-09 11:31 GMT

దిశ, మంగపేట : చిన్నపాటి వర్షం పడితే చాలు దైవ దర్శనానికి మోకాళ్లోతు బురద నీళ్లలో ఆలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం చిన్న వర్షానికే చిత్తడిగా మారుతుంది. ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని స్వపరిపాలన కోసం తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ పాలకులు కూడా ఏడేళ్లుగా తట్టెడు మట్టిపోసిన పాపానపోలేదని మండల కేంద్రం ప్రజలు విమర్శిస్తున్నారు.

2015లో వచ్చిన గోదావరి పుష్కరాలకు రూ.3 కోట్లు పెట్టి గోదావరి తీరంలో పుష్కరఘాట్, మరో రూ.2.50 కోట్లతో మండల కేంద్రంలోని గంపోనిగూడెం క్రాస్ నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణం చేసినా హడావుడి పనుల కారణంగా పుష్కరాలకు వేసిన రోడ్డు పుష్కరకాలం కూడా నిలవలేదు. ఫుష్కరఘాట్ సైతం నిరుడు వచ్చిన గోదావరి వరదలకు కొట్టుకుని పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మండల కేంద్రంపై దృష్టి పెట్టి గంపోనిగూడెం క్రాస్ నుండి బస్టాండ్ వరకు డబుల్ లేన్ రోడ్డు, సైడు డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News