రాయలసీమ ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇన్నిరోజులు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పర్యావరణ అనుమతులు కోసం నిలిచిపోయిన ఈ పథకం కేంద్రం తాజా ప్రకటనతో దానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయ్యింది. శుక్రవారం చైన్నైలోని హరిత ట్రిబ్యునల్ బెంచ్ సమావేశం నిర్వహించగా, ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. చివరగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గ్రీన్ […]

Update: 2020-08-28 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇన్నిరోజులు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. గతంలో పర్యావరణ అనుమతులు కోసం నిలిచిపోయిన ఈ పథకం కేంద్రం తాజా ప్రకటనతో దానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయ్యింది.

శుక్రవారం చైన్నైలోని హరిత ట్రిబ్యునల్ బెంచ్ సమావేశం నిర్వహించగా, ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. చివరగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Tags:    

Similar News