భారత్, నేపాల్‌లను ఏ శక్తీ విడదీయలేదు: రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని కలుపుకున్న నేపాల్ కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, నేపాల్లది ‘రోటీ బేటీ’ బంధమని, ప్రపంచంలోని ఏ శక్తి వీటిని విడదీయలేదని అన్నారు. నేపాల్ చర్యల వెనుక వేరొకరి హస్తమున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నేపాల్‌తో ఏర్పడ్డ అభిప్రాయభేదాలు చర్చల ద్వారా పరిష్కృతమవుతాయని […]
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని కలుపుకున్న నేపాల్ కొత్త మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, నేపాల్లది ‘రోటీ బేటీ’ బంధమని, ప్రపంచంలోని ఏ శక్తి వీటిని విడదీయలేదని అన్నారు.
నేపాల్ చర్యల వెనుక వేరొకరి హస్తమున్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నేపాల్‌తో ఏర్పడ్డ అభిప్రాయభేదాలు చర్చల ద్వారా పరిష్కృతమవుతాయని తెలిపారు.
ఉత్తరాఖండ్ ర్యాలీ కోసం ఆన్లైన్లో మాట్లాడుతూ సరిహద్దు సమీపంలో భారత్ కట్టిన రోడ్ ద్వారా నేపాల్‌లో భిన్నాభిప్రాయాలు ఏర్పడితే వాటిని చర్చించి పరిష్కరిచుకుంటామని చెప్పారు.